ఆధ్యాత్మికం

బాలాపూర్ లడ్డూ చాలా స్పెషల్.. ఈ ఏడాది వేలం పాట ఎంతంటే..?

వినాయకుడి లడ్డూ అనగానే తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి బాలాపూర్ లడ్డూ మాత్రమే గుర్తుకువస్తోంది. ఈ లడ్డూ దక్కించుకోవడానికి సామాన్యులు మాత్రమే కాదు.. ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం పోటీ పడతారు. ప్రపంచ వ్యాప్తంగా విశిష్టమైన చరిత్ర కలిగి ఉన్న బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్‌ ఈసారి వేలం పాటలో బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు.

చివరిసారి 2019లో  కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకోగా ఈ ఏడాది అంతకంటే ఎక్కవ ధర పలికింది. గత 26 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా బాలాపూర్‌ గణేష్‌ లడ్డూవేలం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బాలాపూర్‌ లడ్డూకు పూజలు నిర్వహించిన అనంతరం వేలం పాట ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి, ఇతర రాజకీయ నేతలు పాల్గొన్నారు.

వినాయకుడి నిమజ్జన ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చూసేందుకు ఎంతోమంది భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక రూట్ మ్యాప్ ద్వారా ఖైరతాబాద్ వినాయకుడిని ట్యాంక్ బండ్ కు తరలించారు. భక్తుల కోలాహలం, డీజే చప్పుళ్ల మధ్య వినాయకుల నిమజ్జన ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

Back to top button