ఆధ్యాత్మికం

కొబ్బరికాయ కుళ్ళితే ఏమవుతుంది ?

కొబ్బరికాయ.. హిందూ సంప్రదాయంలో అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మనలో చాలామందికి అనేక సందేహాలు వస్తుంటాయి. పూజ కంటే పూజలో జరిగే చిన్నచిన్న విషయాలపై సందేహాలు. అలాంటి వాటిలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే ఏం అవుతుంది. మంచిదా లేక చెడా అని ఆలోచిస్తారు.

దీనిపై పండితులు చెప్పిన విషయాలు తెలుసుకుందాం…

పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు. తెలిసి చేసే పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం కుళ్ళిన కొబ్బరికాయదే కాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం.

అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళితే కుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ కుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి. లేదా మరో కొబ్బరికాయను తెచ్చి కొట్టి పూజ చేయాలి. పూజ మీద శ్రద్ధపెట్టాలి. అంతేకాని కొబ్బరికాయపై కాదు అనేది బాగా గుర్తుంచుకోవాలి.

Back to top button