సినిమా

Rashmika: రష్మీక ఆ పని చేసింది విజయ్ కోసమేనా ?

Rashmika : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి “చలో” అనే సినిమాతో అడుగు పెట్టిన రష్మీక మందన..తన అందం అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. వెండితెరపై క్యూట్ జోడిగా విజయ్ దేవరకొండ-రష్మీక మందన కుర్రకారులో క్రేజ్ సంపాదించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని తరచుగా గోసిప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్నికి లెజెండరీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అనన్య పాండ్య హీరోయిన్ గా నటిస్తుంది.

అదేవిధంగా రష్మిక తాజాగా మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా కు జోడిగా రష్మిక నటిస్తుంది. ఇటీవలే రష్మిక చేసిన ఓ పని వల్ల… మళ్లీ వార్తల్లోకి కెక్కింది. తాజాగా రష్మిక తన ఇంస్టాగ్రామ్ లో స్టోరీ లో ఓ పోస్టు షేర్ చేసే తను ఎక్కడికి వెళుతున్నానో గెస్ చేయమని పేర్కొంది. ఆ ఫోటోలో రష్మీక పాస్ పోర్ట్ చేతిలో పట్టుకొని ఉంది. దీంతో ఆ ఫోటో చూసిన నెటిజెన్లు షాక్ అవుతున్నారు. కానీ ఈసారి మీకు చాలా దూరంగా వెళుతున్నాను ..నేను త్వరలో తిరిగి వస్తాను అని రష్మిక పేర్కొంది.

ఆ నేషనల్ క్రష్ షేర్ చేసిన ఫోటోలు చూసిన పలువురికి అనుమానాలు మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు ఏమో.. రష్మిక అమెరికాకు వెళ్లిందని..అక్కడ విజయ్ దేవరకొండ లైగర్ చిత్ర షూటింగ్ జరుగుతుందని.. అందులో భాగంగా కో యాక్టర్, క్లోజ్ ఫ్రెండ్ అయిన విజయ్ ని కలవడానికి పోయి ఉంటుందని.. అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో లైగర్ సినిమాలో రష్మికా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాదాని ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక తెలుగులో అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో నటిస్తుంది. అలాగే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమా చేస్తుంది. గుడ్ బై అనే చిత్రంలో కూడా రష్మికా నటిస్తోంది.

 

 

Back to top button