సినిమా

Nagachaitanya: సామ్ కన్నా ముందు ఆ హీరోయిన్ ని చై పెళ్లి చేసుకోవాలనుకున్నాడా ?

NagaChaitanya : ఎన్నో ఏండ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంట సమంత-నాగ చైతన్య టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు. ఏప్పుడు ఏదో ఒక వైవిధ్యమైన పనులు చేస్తూ నిత్యం వారిద్దరూ వార్తల్లో నిలిచేవారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని అగ్రహీరోల జంటలు ఉన్న.. ఈ అక్కినేని కపుల్స్ దే ప్రత్యేకం. దీంతో అల్ టైం ఫేవరేట్ జోడిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.. దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు సాగిన వీరి సంసారం… ఇటీవలే రెండు ముక్కలైపోయింది. సామ్-చై ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు.

ఇదేమైనా టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరుగాంచిన సమంతా నాగ చైతన్యలు విడిపోవడం అనేది తెలుగు ప్రేక్షకులందరికీ జీర్ణించుకోలేని విషయం. సమంత నాగ చైతన్య తో ఉన్న జ్ఞాపకలన్ని చెరిపి వేయటానికి విదేశాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లి సేద తీరుతుంది. దీంతో ఇక సమంత ఫోకస్ అంతా సినిమాల పైనే పడింది. చై ఏమో ఎప్పటిలానే సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అయితే నాగచైతన్య సమంత ని మ్యారేజ్ చేసుకోక ముందు…మరో హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమయ్యాడని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి

నాగ చైతన్య మొదట్లో తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ని ప్రేమించాడట. అయితే వీరి ప్రేమ మాత్రం మ్యారేజ్ వరకు దారితీయ లేదట. వీరిద్దరూ కలిసి నటించిన ప్రేమమ్ చిత్రం ద్వారా..వీరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట. కానీ వీరి ఇద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ కాస్త రిలేషన్షిప్ గా మారినా ఎక్కువ కాలం కొనసాగలేదు. శృతిహాసన్ తో తన లవ్ వర్కవుట్ కాకపోవడంతో.. ఆ తర్వాత నాగచైతన్య సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నాగచైతన్య శృతి హాసన్ ని ప్రేమించింది నిజమో కదో తెలీదు కానీ.. ఒకవేళ లవ్ చేసి ఉంటే చై ఫస్ట్ లవ్ తో పాటు సెకండ్ లవ్ కూడా ఫెయిల్ అయినట్లే. మొత్తానికి అయితే చైతన్యకి లవ్ ఆచి రావడం లేదని చెప్పవచ్చు

Back to top button