Featuredసినిమా

RRR Movie ఆర్‌ఆర్‌ఆర్ గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరో నిఖిల్…

RRR Movie దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్​ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ హీరోలుగా రానున్న సినిమా ” ఆర్​ఆర్​ఆర్ “​. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రోమోలు, పోస్టర్​లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు. కాగా వీరి సరసన ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్ హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ నెట్టింట్లో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా నాటు నాటు వీర నాటు పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన జననీ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సాంగ్ యువ హీరో నిఖిల్ కు బాగా కనెక్ట్ అయినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ పాట గురించి స్పందిస్తూ ట్విట్టర్ లో ఒక ఎమోశ్హనల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో ఇప్పటికే 20 సార్లు విన్నాను అంటూ ట్వీట్స్ చేశారు. జనని సాంగ్ విని కన్నీళ్లు కార్చాను. దేశం మొత్తం గర్వించే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఆర్‌ఆర్‌ఆర్‌’కి దేశవ్యాప్తంగా పన్ను మినహాయింపు ఇవ్వాలని నా విన్నపం’ అని నిఖిల్‌ పేర్కొన్నాడు. ఈ చిత్రం జనవరి 7న భారీ స్థాయిలో విడుదల కానుంది.

Jaya Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button