Featuredసినిమా

Actor Srikanth : రోజాతో రొమాంటిక్ సీన్స్‌పై టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్

Actor Srikanth ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు శ్రీకాంత్. దాదాపు 100 సినిమాలకు పైగా హీరోగా నటించిన శ్రీకాంత్ ఈ మధ్య కాలంలో కాస్త వెనుకబడ్డారు. హీరోగా క్లాస్ మాస్ ఆడియన్స్ ను అలరించిన ఈ సీనియర్ హీరో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అలరించారు. మెగా హీరో రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. అలాగే అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో బన్నీకి బాబాయ్ గా నటించి అలరించారు. ఇక ఇప్పుడు విలన్ గా నటించి భయపెట్టడానికి సిద్ధమయ్యారు. నాగచైతన్య నటించిన యుద్ధం శరణం మూవీలో శ్రీకాంత్ విలన్ గా నటించారు. కాకపోతే ఆ మూవీ శ్రీకాంత్ కి అంతా బ్రేక్ ఇవ్వలేదని చెప్పాలి. ఇప్పుడు మరోసారి నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు శ్రీకాంత్.

శ్రీకాంత్ – రోజా కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆన్ స్క్రీన్ మీద మంచి కెమిస్ట్రీ పండించి సక్సెస్ ని అందుకున్నారు ఈ జంట. అయితే సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల రిలేషన్ షిప్‌ల మీద ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. కానీ తెర వెనుక మాత్రం మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంటారు. అలా శ్రీకాంత్ రోజా మధ్య కూడా మంఛీ స్నేహ బంధం ఉందట. ఇటీవల ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రోజా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శ్రీకాంత్. ఈ ఇంటర్వ్యూ లో 90 లలో స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందిన సౌందర్య, రమ్యకృష్ణ, రాశి, రోజా గురించి శ్రీకాంత్ మాట్లాడడం జరిగింది. హీరోయిన్స్ అందరితో తనకు చాలా సన్నిహిత సంబంధం ఉండేదట. అందరూ ఒక కుటుంబంలా కలిసి ఉండేవారని ఆయన అన్నారు.

Actor Srikanth : రోజాతో రొమాంటిక్ సీన్స్‌పై టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్
Actor Srikanth : రోజాతో రొమాంటిక్ సీన్స్‌పై టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్

అయితే ఆ సన్నిహిత సంబంధంతో షూటింగ్స్ సెట్స్ లో వరుసలు పెట్టి పిలుచుకునేవారట. ఇక రోజా శ్రీకాంత్ ని అన్నయ్య అని పిలిచేదట. ప్రతి సన్నివేశంలో నటించే సమయంలో అలా చేద్దాం… ఇలా చేద్దాం అన్నయ్య అని సంభోధించేదట. చివరకు రొమాంటిక్ సన్నివేశాల సమయంలో కూడా రోజా అన్నయ్య అంటూ పిలిచేదట. దానితో ఎహె ఆపు… నువ్వు అన్నయ్య అంటుంటే నాకు రొమాంటిక్ మూడ్ రావడం లేదని శ్రీకాంత్ అనే వాడట. నవ్వుతూ ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు శ్రీకాంత్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Jay Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button