Featuredబిగ్ బాస్

Bigg Boss 5 అకారణంగా ట్రోల్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన… యాంకర్ రవి భార్య

Bigg Boss 5 తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సీజన్ లో 19 మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. కాగా ఇంటి సభ్యులంతా వారి వారి శైలిలో అందరూ బాగానే ఆడుతున్నారు దీంతో ఏ వారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడో చెప్పడం కష్టంగా మారింది. అయితే ఈ సీజన్ లో యాంకర్ రవి ఒక కంటస్టెంట్ గా ఇంట్లోకి అడుగుపెట్టాడు. బుల్లితెరపై యాంకర్ రవికి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. త‌న యాంక‌రింగ్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు రవి. ప్రతీవారం నామినేట్ అవుతున్నా కూడా అంత బాగా రవి సేవ్ అవుతున్నాడంటే దానికి కారణం బయట రవికి ఉన్న ఫాలోయింగ్ అనే చెప్పాలి.

అయితే ఈ షోతో ర‌వి పట్ల కొంతమేర నెగెటివిటీ వచ్చినట్లు తెలుస్తుంది. హోస్ట్ నాగార్జునతో పాటు తోటి కంటెస్టెంట్స్ కూడా ర‌విని ప‌లు సంద‌ర్భాల‌లో విమర్శిణచడం తెల్సిన విషయమే. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ రవికి ఏకంగా గుంట న‌క్క అని పేరు కూడా పెట్టారు. బిగ్ బాస్ 5 సీజ‌న్‌లో ర‌వి స్ట్రాంగ్ క్యాండిడేట్ కాగా, టైటిల్ విన్న‌ర్‌ల‌లో ఒక‌డిగా నిలిచే స‌త్తా అత‌నికి ఉంది. అయితే కొంత‌మంది యాంకర్‌ రవిని అకార‌ణంగా ట్రోల్‌ చేయ‌డం మొద‌లెట్టారు.

సోష‌ల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి, ర‌విని, వాళ్ల కుటుంబ స‌భ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని రవి సన్నిహితులు చెబుతున్నారు. ‘కావాలనే కొంతమంది నా పేరును, నా కూతురిని ఈ ట్రోల్స్‌ లోకి తీసుకొస్తున్నారు’ అని రవి భార్య నిత్య ఆవేదన వ్యక్తం చేస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కాగా ఈ వారం కెప్టెన్ మానస్ తప్ప మిగితా వారందరు నామినేషన్లో ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న ఇంటి సభ్యులు షన్ను, రవి, సన్నీ, శ్రీరాం, సిరి, ప్రియాంక, కాజల్. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వారాంతం వరకు ఆగాల్సిందే.

Jay Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button