Featuredబిగ్ బాస్

Bigg Boss 5 షణ్ముఖ్ నువ్వు హగ్ చేసుకోవడం నాకు నచ్చట్లేదు అంటున్న… సిరి తల్లి

Bigg Boss 5 తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సీజన్ లో 19 మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా ఇంటి సభ్యులంతా వారి వారి శైలిలో అందరూ బాగానే ఆడుతున్నారు. అయితే బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ లకు, ఫ్రెండ్ షిప్ లకు పెట్టింది పేరు… ఏ సీజన్లోనైనా బిగ్ బాస్ నిర్వాహకులు లవ్ ట్రాక్ క్రియేట్ చేయడానికి ప్లాన్ లు వేస్తూ ఉంటారు. పోయిన సీజన్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ క్రియేట్ చేశారు. అదే విధంగా ఈ సీజన్లో బిగ్ బాస్ 5 లో షణ్ముఖ్, సిరి వ్యవహారం మామూలుగా లేదు. వీరిద్దరు తెగ క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. హగ్‌లు, ముద్దులతో రెచ్చిపోతూ బిగ్‌బాస్‌కు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. ఒకపక్క మేమిద్దరం ఫ్రెండ్స్ అంటూ.. హగులు, ముద్దులు ఇచ్చుకుంటూ హౌస్ లో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. అయితే తాజాగా ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు.

ఈ ప్రోమోలో మానస్ అమ్మ, సిరి అమ్మ ఇంటిలోకి రావడం గమనించవచ్చు. మానస్ అమ్మ గారు ఇంటిలోకి రాగానే అందరితో సరదాగా మాట్లాడుతూ ఫుల్ ఫన్ కలగజేశారు. ఈ తరుణంలోనే శ్రీరామ చంద్ర, కాజల్ లపై జోక్స్ కూడా వేశారు. అనంతరం సిరి తల్లి కూడా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. ఆమెను చూసిన ఆనందంలో సిరి వెళ్ళి ఆమెను గట్టిగా కౌగలించుకుంటుంది. ఆ తర్వాత తన మాటలతో ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది. నువ్వు, షణ్ముక్ హగ్ చేసుకోవడం నాకు నచ్చట్లేదు అంటూ తేల్చి చెప్పింది. ఆమె మాటలకి షణ్ముఖ్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు అని అర్దం అవుతుంది. మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఎదురు చూడక తప్పదు.

గత వారం సిరి బాత్రూంలోకి వెళ్లి కొట్టేసుకోవడం, తనను తాను గాయపర్చుకోవడంపై నాగార్జున ఫైర్ అయ్యాడు. మీరు చేసుకునే రొమాన్స్ మీద నేను ప్రశ్నించను అని పరోక్షంగా కౌంటర్లు కూడా వేశాడు. కానీ ఇలా నిన్ను నువ్ గాయపర్చుకోవడం తప్పు అని నాగార్జున కాస్త స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే మళ్లీ షన్ను సిరిలు అదే ట్రాక్ అదే పద్దతిని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. నిన్న ఎపిసోడ్ లో కూడా షణ్ముక్ సింహాసనంలో కూర్చోవడంతో సిరి ఆనందంతో వచ్చి అకస్మాత్తుగా చెంప మీద ముద్దు పెట్టింది. ఆ తర్వాత రైల్ టాస్క్ కి ముందు మంచం మీద పడుకొని ఉన్న షన్ను ని వచ్చి సిరి హగ్ చేసుకుంది. మరి సిరి అమ్మ గారి మాటలతో అయిన ఈ రొమాన్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

Jay Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button