Featuredబిగ్ బాస్

Bigg Boss 5 అతనంటే ఇష్టం అని సిరి నాతో చెప్పిందంటున్న యాంకర్ రవి…

Bigg Boss 5 బుల్లితెర ప్రేక్ష‌కులని అల‌రిస్తున్న గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 5. ఇప్పటికీ స‌క్సెస్ ఫుల్‌గా 12 వారాలు పూర్తి చేసుకుంది. కాగా ఈ వారం యాంకర్ ర‌వి బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి బ‌య‌ట‌కు వచ్చారు. అత‌ను బ‌య‌ట‌కు రావ‌డాన్ని ర‌వి అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. కావాలనే రవిని ఇంటి నుంచి బయటకు పంపేశారని… అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కు ప్రియాంక సింగ్, కాజల్ కంటే తక్కువ ఓట్లు ఎలా పడతాయి ? అని అంటున్నారు. ఇలా అన్యాయంగా రవిని ఎలిమినేట్ చేయడమేంటి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

హౌస్ లో ఎలిమినేట్ అయిన వారంతా బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ ఇస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. మిగతా కంటస్టెంట్ ల మాదిరిగానే రవిని కూడా అరియానా ఇంటర్వ్యూ చేసింది. ఆ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అందులో సిరి, షన్నుల మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అసలు షన్ను ఇంట్లో ఎప్పుడు ఆట ఆడాడంటూ కౌంటర్లు వేశాడు. ఇక వారి రిలేషన్ మీద అరియానా ప్రశ్నలు అడగగా రవి అసలు విషయాన్ని చెప్పేశాడు. దీప్తి సునయనను షన్ను ఎంత ప్రేమిస్తున్నాడో బయట అందరికీ తెలుసు. శ్రీహాన్‌ను సిరి ఎంత ప్రేమిస్తుందో అందరికీ తెలుసు. కానీ లోపల ఆ ఇద్దరూ మాత్రం కనెక్ట్ అయ్యారు. నేను సిరిని పర్సనల్‌గా అడిగాను. నాకు షన్ను అంటే ఇష్టం, ఐ లైక్ షన్ను… ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యామంటూ సిరి చెప్పిందట. ఈ విషయాలన్నీ రవి బయటపెట్టేశాడు.

మరి రానున్న ఈ మూడు వారాల్లో సిరి షన్ను వ్యవహారం ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు ర‌విని బిగ్‌బాస్‌ పంపించి వేయడానికి భారీ రెమ్యునరేషన్‌ కూడా ఒక కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నారట. వారానికి రూ. 7 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్యలో ఇస్తున్నారట. ఇలా రవి 12 వారాలకే 90 లక్షల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. ఇది బిగ్‌బాస్‌ విజేతకు అందించే 50 లక్షల ప్రైజ్‌మనీ కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం రవి చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Jaya Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button