Featuredసినిమా

Priyanka Chopra ఆ విషయంలో సమంతను ఫాలో అవుతున్న ప్రియాంక చోప్రా… సోషల్ మీడియా ఖాతాల్లో “నిక్” పేరు తొలగింపు

Priyanka Chopra గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. తన నటనతో, గ్లామర్ తో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యే స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో కూడా తన సత్తాను చాటుతూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. హాలీవుడ్‌కు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుంది ప్రియాంకా చోప్రా. పెళ్లి తర్వాత కూడా వరుస సీన్ ఇమాలు కేస్తే దూసుకుపోతుంది ఈ భామ. అయితే సెల‌బ్రిటీల రిలేష‌న్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు క‌లుస్తారో, ఎప్పుడు విడ‌కాలు తీసుకుంటారో ఎవ‌రికి అర్ధం కాదు. త‌న భ‌ర్త నిక్ జోన‌స్ నుంచి ప్రియాంక చోప్రా విడిపోనుందా అంటే అవున‌నే అంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు.

అయితే తాజాగా ప్రియాంకా చేసిన ఒక పని గురించే ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఈ అందాల భామ సోషల్ మీడియా లోని తన అకౌంట్ లకు తన భ్ర్థ పేరు తొలగించి ప్రియాంక అనే మార్చేసింది. దీంతో అందరికీ ఒక్కసారిగా అనుమానాలు రేకెత్తాయి. ప్రముఖ తెలుగు నటి సమంత కూడా విడాకులకు కొన్ని రోజులు ముందు తన పేరు ముందు అక్కినేనిని సోషల్ మీడియాలో తొలిగించినపుడే అందరికీ అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఏం లేదు అంటూ సమంత వివరణ ఇచ్చినా… చివరకు నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా సమంత బాటలోనే విడకులకు సిద్దమవుతుందా అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

ప్రియాంక తెలుగులో రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా హిందీలో ‘జంజీర్’గా విడుదలైంది. ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ మూవీ అమితాబ్ ఆల్ టైమ్ క్లాసిక్ ‘జంజీర్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ప్రస్తుతం పలు హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది. ప్రియాంక చోప్రా హిందీలో 70.5 ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న నటిగా రికార్డులకు ఎక్కింది. ఇక ప్రియాంక ప్రస్తుతం నటిస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక టెక్ట్స్ ఫర్ యు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను జేమ్స్ సీ స్ట్రౌజ్ దర్శకత్వం వహిస్తున్నారు. జర్మన్ ఫిలిం ఎస్ఎంఎస్ కు రీమేక్‌గా ఈ సినిమా వస్తోంది. ఇక ప్రియాంక నటిస్తోన్న మరో హాలీవుడ్ చిత్రం మ్యాట్రిక్స్ 4. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

Jay Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button