Featuredసినిమా

Siva Shankar Master ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కన్నుమూత…

Siva Shankar Master కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంటే తెలియని వారెవ్వరు ఉండరనే చెప్పాలి. 10 రకాల భాషలు పైగా తన నృత్యం ప్రదర్శనలు ప్రదర్శించారు శివశంకర్ మాస్టర్ అలానే డాన్స్ షో లు కు జడ్జ్ గా కూడా వ్యవహరించారు. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, అరుంధతి వంటి సూపర్ హిట్ చిత్రాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. తెలుగు తమిళ మలయాళం భాషల్లో కూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎంతమంది ప్రముఖులచే ప్రశంసలందుకున్నారు. ఇటీవల మాస్టర్ కుటుంబం కరోనా బారినపడగా… చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తుంది.

ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలోని ఎ.ఐ.జి ఆస్పత్రిలో గత కొద్ది రోజులుగా వెంటిలేటర్ మీద శివ శంకర్ మాస్టర్ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన భార్య క్వారంటైన్‌లో ఉండగా … పెద్ద కుమారుడు సైతం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో శివశంకర్ మాస్టర్‌కు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్‌ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటించారు శివశంకర్. టీవీల్లో డాన్స్ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు మాస్టర్. శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు.

ఆర్దిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి కుటుంబ సాభ్యులకు సోనూ సూద్, ధనుష్, మెగాస్టార్ చిరంజీవి ఆర్దిక సాయం అందించిన విషయం తెలిసిందే. శివ శంకర్ మాస్టర్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Jaya Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button