Featuredవార్త‌లువైరల్సినిమా

Devoleena Bhattacharjee : ట్యూషన్ టీచర్ తనతో అలా ప్రవర్తించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సీరియల్ నటి..

Devoleena Bhattacharjee : ప్రస్తుత కాలంలో మహిళలకు కాస్టింగ్ కౌచ్ సమస్యలు మరియు లైంగిక వేధింపులు వంటి వాటిని పూర్తిగా అవగాహన ఉంది. దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలకు మరియు చిన్న పిల్లలకు లైంగిక వేధింపులపై పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ ప్రముఖ సీరియల్ హీరోయిన్ చిన్నప్పుడు తన ఎదుర్కొన్నటువంటి లైంగిక వేధింపుల విషయం గురించి సోషల్ మీడియాలో తెలియజేయడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన స్టార్ మా ఛానల్ లో ఒకప్పుడు ప్రసారమయ్యే కోడలా కోడలా కొడుకు పెళ్లామా అనే ధారావాహిక ద్వారా ప్రముఖ హిందీ సీరియల్ హీరోయిన్ దేవలోన భట్టా చర్జీ గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. కాగా తాజాగా దేవలోన భట్టా చర్జీ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల విషయం గురించి ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులో భాగంగా తాను పాఠశాలకు వెళ్లే సమయంలో ట్యూషన్ కి వెళ్ళేదాన్ని అని ఈ క్రమంలో తన ట్యూషన్ టీచర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఎమోషనల్ అయింది.

అయితే ఈ విషయం గురించి తన కుటుంబ సభ్యులతో చెప్పినప్పటికీ తాను చిన్నపిల్ల కావడంతో ఎవరూ నమ్మలేదని అంతేకాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదని తెలిపింది. కానీ ఆ తర్వాత తనని ట్యూషన్ మానిపించారని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇలాంటి విషయాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని కాబట్టి చిన్న పిల్లలు లైంగిక వేధింపులు గురించి ఏదైనా విషయాలు చెబితే సీరియస్ గా తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది.

అయితే దేవలోన భట్టా చర్జీ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్యూషన్ టీచర్ పేరుని మాత్రం బయట పెట్టడానికి ఇష్ట పడలేదు. దీంతో కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకి ఇంట్లో బడిలో గుడిలో ఇలా ఎక్కడా కూడా రక్షణ లేదని దాంతో ఆడపిల్లల జీవితాలు ఆదిలోనే అంతం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దేవలోన భట్టా చర్జీ పలు హిందీ ధారావాహికలలో నటిస్తోంది. అలాగే ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Back to top button