Featuredవార్త‌లువైరల్

Dog Marriage : ఇదేం విడ్డూరం : కట్టుకున్న భర్తని వదిలి పెట్టి కుక్క తో అలా….

Dog Marriage : ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు కి విలువ క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నప్పటికీ కొందరు మాత్రం పెంపుడు జంతువుల పై ప్రేమను అధికంగా చూపిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో కొందరు డబ్బున్న వ్యక్తులు ఏకంగా పెంపుడు జంతువులు కుక్కలు, పిల్లులు వంటి వాటిని పెంచుకుంటూ వాటి సంరక్షణ కోసం ప్రతి ఏటా లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో పలు ఎన్.జి.ఓ సంస్ధలు కూడా మూగ జీవాలకు సమస్యలు వస్తే ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఇటీవల కాలంలో కొందరు మూగజీవాల పై అతి ప్రేమ ను పెంచుకుంటూ ఏకంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. కాగా ఇటీవలే 47 సంవత్సరాలు కలిగిన మహిళ తన పెంపుడు కుక్క ని పెళ్లి చేసుకున్న ఘటన లండన్ పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక లని పరిసర ప్రాంతంలో అమాండా అని మహిళ నివాసం ఉంటోంది. కాగా అమాండా కి గత కొన్ని సంవత్సరాల క్రితం తన భర్తతో బేధాభిప్రాయాలు మరియు విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తన బంధువులు కూడా అమాండా బాధను పట్టించుకో లేదు. దీంతో అమాండా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో తన ఒంటరితనం నుంచి దూరం అవడానికి దగ్గరలో ఉన్నటువంటి ఎన్జీవో సంస్థ నుంచి పెంపుడు కుక్క ని తెచ్చి పెంచుకుంటోంది. ఈ క్రమంలో తన పెంపుడు కుక్క కి శేబా అని నామకరణం కూడా చేసింది. దీంతో శేబా కోసం ఖరీదైనా ఆహార పదార్థాలు మరియు ఇతర వస్తువులను సమకూర్చింది. దీంతో శేబా కూడా అమాండా తో ఆడుకుంటూ బాగా చనువుగా ఉండేది.

అయితే తాజాగా అమాండా తన పెంపుడు కుక్క అయిన శేబా ని పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ మధ్య ఓ ఇంగ్లీష్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అమాండా పాల్గొని తన భర్త గురించి పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులో భాగంగా తన ఒంటరి జీవితంలోకి తన భర్త శేబా (పెంపుడు కుక్క) వచ్చిన తర్వాత చాలా ఆనందం కలిగిందని అందువల్లనే తన పెంపుడు కుక్క ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఈ క్రమంలో తన బంధువులందరినీ పిలిచి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. అలాగే తన భర్తకి ప్రపోజ్ చేసినప్పుడు శేబా తోక ఊపుతూ అంగీకరించిందని కూడా చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇందులో భాగంగా కొందరు నెటిజన్లు అమాండా శేబా పెళ్లి గురించి స్పందిస్తూ జంతువుల పై ప్రేమ ఉండటం మంచిదేనని కానీ పెళ్లి చేసుకొని జీవనం సాగించడం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మనుషుల జీవన శైలికి జంతువుల జీవన శైలికి చాలా తేడా ఉంటుందని అలాగే మనుషులకు, జంతువులకు మధ్య వ్యత్యాసం కూడా చాలా ఉంటుందని కాబట్టి వాటిపై లేనిపోని మమకారాలు పెంచుకోవడం మంచిది కాదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Back to top button