Featuredవార్త‌లువైరల్

Interesting Fact : అది మర్చిపోతే.. ఊచలు లెక్కపెట్టాల్సిందే..!

Interesting Fact మహిళల రక్షణకై ప్రతి దేశంలో ఆ దేశ ప్రభుత్వాలు వివిధ చట్టాలు అమలు చేస్తాయి. మహిళలను కన్నెత్తి చూసిన, గౌరవించకపోయిన, మహిళలు సరైన వస్త్రధారణ చేయకపోయిన, తల్లిదండ్రులను దూషించిన నేరం మోపుతారు. ఇలా ఏ దేశానికి సంబంధించిన చట్టాలు ఆ దేశాల్లో అమలు అవుతుంటాయి.

పసిఫిక్ సముద్రంలోని పోలినేసియన్ అనే ప్రాంతంలో సమోవా దీవి ఉంది. ఈ దీవి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఏ దేశంలో అయినా మహిళను కించపరిచే విధంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసిన, మహిళలలతో అసభ్యంగా ప్రవర్తించినా వారిపై చట్ట రీత్యా నేరాలు మోపుతుంటారు. ఈ దీవిలో ఒక వింత చట్టం అమలులో ఉంది. ఆ చట్టం ఏంటంటే… భార్య పుట్టిన రోజును మర్చిపోతే జైలు శిక్ష విధిస్తారు.

ఎంతో అందంగా ఉండే సమోవా దీవి భర్తలకు మాత్రం నరకం చూపిస్తుంది అని చెప్తారు. పని హడావిడి లేదా ఏదైనా టెన్షన్ లో ఉండి భార్య పుట్టినరోజు ను మర్చిపోయి ఉన్నట్లయితే జైలుకే తరలిస్తారట. భార్య అర్థంచేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉంటె ఈ బాధ ఉండదు కానీ నా పుట్టిన రోజును మర్చిపోతావా అని ఫిర్యాదు చేస్తే మాత్రం ఊచలు లెక్కపెట్టాల్సిందే.. మొదటి సారి ఫిర్యాదు చేసినపుడు హెచ్చరించి వదిలేస్తారు. రెండవ సారి పునరావృతం జరిగితే మాత్రం జైలు శిక్ష అనుభవించాల్సిందే.

భార్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, భార్యలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని అక్కడి ప్రభుత్వం ఈ చట్టం అమలు చేసిందని చెప్తారు. ఏది ఏమైనా అర్థం చేసుకునే భార్యలు ఉంటె భర్తలు బతికిపోతారు లేదంటే ఇటువంటి చట్టాలకు బలి కావాల్సిందే. ఈ చట్టం ప్రపంచం మొత్తం మీద ఈ దీవిలో మాత్రమే ఉంది. ఇటువంటి విచిత్ర చట్టాలు మరికొన్ని దేశాలలో కూడా ఉన్నాయి. ఈస్ట్ ఆఫ్రికా లో బయట జాగింగ్ చేయడం నిషేధం. ఉత్తరకొరియా లో బ్లూ కలర్ జీన్స్ వేసుకొని బయటకెళ్లకూడదు. ఓక్లహోమాలో కుక్కలను తిడితే నేరం.

Back to top button