Featuredసినిమా

Aamir Khan బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కు హైదరాబాద్ అమ్మాయితో మూడో పెళ్లి… ఎవరంటే ?

Aamir Khan బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన నటనతో దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు. బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరొందారు అమీర్. సినిమాల పరంగా వరుస సినిమాలతో దూసుకుపోతూ అందర్నీ అలరించే అమీర్ ఖాన్… తన పర్సనల్ జీవితంలో మాత్రం వివాదాలను ఎదుర్కొంటున్నాడు. 1986 లో రీనా దత్తాని పెళ్లి చేసుకొని సరిగ్గా 15 ఏళ్ళకు విడాకులు తీసుకున్నాడు అమీర్ ఖాన్. ఆ తర్వాత 2005 సంవత్సరంలో కిరణ్ రావు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే గత ఏడాది అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు ఇకపై తాము తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలని భావిస్తున్నట్టు అభిమానులకు తెలిపారు. మళ్ళీ సరిగ్గా 15 ఏళ్ళకి మరోసారి విడాకులు తీసుకున్నారు అమీర్.

కాగా అమీర్ ఒక నటితో ప్రేమలో ఉన్నదని అందుకే అందుకే కిరణ్ రావుకి విడాకులు ఇచ్చాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ తరుణంలో అమీర్ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఎవరో కాదు మన హైదరాబాద్ అమ్మాయే. “దంగల్” చిత్రంలో అమీర్ ఖాన్ కి కూతురు గా నటించిన నటి ఫాతిమా సన షేక్ తో అమీర్ ఖాన్ ప్రేమలో ఉన్నాడని బాలీవుడ్ లో గుసగుస లాడుకుంటున్నారు. ప్రస్తుతం 29 ఏళ్ళు ఉన్న ఈ భామ 1992 లో హైదరాబాద్ లో జన్మించి 2016 లో చాచి 420, వన్ 2 కా 4 వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ భామతో ప్రేమ వ్యవహారం వల్లనే అమీర్ దంపతులు విడిపోయారని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.

అందువల్లనే ఆ నటికి తన చిత్రమైన “ది థగ్స్ అఫ్ హిందూస్తాన్” లో అమీర్ ఖాన్ ఛాన్స్ ఇచ్చాడని సమాచారం. అలానే ఫాతిమా కూడా ముంబైకి వచ్చిన ప్రతిసారి అమీర్ ను కచ్చితంగా కలుస్తుందని అంటున్నారు. ఈ జంట చాలా పార్టీలకి కూడా హాజరయ్యారని అంటున్నారు. ప్రస్తుతం ఈ విడాకుల విషయం కాస్త సద్దుమని గాక అమీర్ ఖాన్ ఫాతిమా ను పెళ్లి చూసుకుంటారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

Jay Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button