Featuredసినిమా

Khadgam Movie: ఖ‌డ్గం సినిమాలో సంగీత బెడ్ రూం సీన్‌ వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటో తెలుసా…

Khadgam Movie: వైవిధ్య దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ఖడ్గం. 2002లో వచ్చిన ఈ సినిమా భారతదేశంలో హిందూ, ముస్లింల మధ్య స్నేహ బంధం నేపధ్యంలో తెరకెక్కింది. దేశం జోలికొస్తే అందరం ఒకటవుతామంటూ తెలిపే సందేశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కురిపించింది. ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలలో కనిపించారు. ఈ చిత్రానికి నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు సైతం దక్కాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే, కిమ్ శ‌ర్మ, సంగీత హీరోయిన్ లు గా నటించారు.

కాగా ఖడ్గం లో సంగీత పాత్ర గురించి చెప్పాలంటే సినిమా అవకాశాల కోసం పల్లెటూరి నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి పాత్రను పోషించింది. అయితే ఈ మూవీలో దర్శకుడితో బెడ్ రూమ్ లోకి వెళ్లాల్సిన సీన్ ఉంది. సంగీత రవితేజను ఇష్టపడుతున్నా సంగీత అమ్మ (పావ‌లా శ్యామ‌ల‌) త‌న కూతురును హీరోయిన్ చేయాల‌న్న పిచ్చితో ఆమె బలవంతంతో అయిష్టం గానే సంగీత ఆ దర్శకుడితో రూమ్ లోకి వెళుతుంది. ఆ దర్శకుడి ఒడిలో కూర్చోని అతనికి మందు తాగిస్తూ ఉంటుంది. అప్పుడు ర‌వితేజ త‌లుపు తోసుకు వ‌చ్చి ఆ సీన్ చూసి విల‌విల్లాడిపోతాడు. సినిమా రంగంలో సహజంగా హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని… కృష్ణవంశీ కూడా ఆ సీన్ అందుకే పెట్టారని అప్పట్లో టాక్ వచ్చింది. అప్పట్లో టాలీవుడ్ లో ఓ సీనియర్ డైరెక్టర్ ను టార్గెట్ చేసే క్రమంలోనే కృష్ణవంశీ ఈ సీన్ కావాలని పెట్టారని టాక్ నడిచింది.

మరోవైపు రమ్యకృష్ణను ఓ సినిమా షూటింగ్‌లో ఓ డైరెక్టర్ ఇబ్బంది పెట్టిన క్రమంలో కృష్ణవంశీ కావాలనే ఆయనను టార్గెట్ చేస్తూ ఖడ్గంలో ఈ సీన్ క్రియేట్ చేశారని ప్రచారం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత రమ్యకృష్ణ సైతం ఇండస్ట్రీలో ఓ న‌టి స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే తప్పకుండా దర్శక, నిర్మాతలకు లొంగి పోవాల్సిందే అని వారు ర‌మ్మ‌న్న గ‌దుల్లోకి వెళ్ళాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ఆ సీన్ వునుక ఉన్న ఆంతర్యం ఏంటో కృష్ణవంశీ కె తెలియాలి.

Jaya Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button