Featuredసినిమా

Evaru Meelo Koteeswarulu ఎవరు మీలో కోటీశ్వరులు ఎన్టీఆర్ – మహేష్ ఎపిసోడ్ లో… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Evaru Meelo Koteeswarulu యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక వైపు సినిమాల్లో దూసుకుపోతూ మరోవైపు జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న “ ఎవరు మీలో కోటీశ్వరులు ” అనే ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా చేసి యాంకరింగ్ లోను తన సత్తా చాటిన విషయం అందరికి తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు కూడా తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ… ఈ షోకు గతంలో ఎన్నడు లేని విధంగా టీఆర్ఫీలను పొందేలా చేస్తున్నారు. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ఈ గేమ్ షో అక్కినేని నాగార్జున హోస్ట్ గా 3 సీజన్లు విజయవంతంగా నడిపించాడు. మొదట్లో ఉన్న క్రేజ్ మూడో సీజన్లో పెద్దగా కనిపించకపోవటంతో, మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా నాలుగో సీజన్ ఎలాగోలా ముగించారు. అయితే టిఆర్పి లు పెద్దగా ఆశాజనకంగా లేకపోవటంతో స్టార్ మా లో మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో ఐదో సీజన్ మొదలు కాలేదు.

ఇదే ప్రోగ్రాం ఇప్పుడు జెమినీ టీవీ లో ఎవరు మీలో కోటీశ్వరుడు పేరుతొ ఎన్టీఆర్ హోస్ట్ గా టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రారంభ ఎపిసోడ్ రామ్ చరణ్ తో మొదలైన ఎవరు మీలో కోటీశ్వరులు, బిగ్ బాస్ అంత కాకపోయినా మంచి రేటింగ్ నే తెచ్చుకుంది. దసరాకు రెండు వారాల ముందే మహేష్ బాబు తో స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేసారు. నిజానికి ఈ ఎపిసోడ్ దసరా సందర్భంగా టెలికాస్ట్ చేద్దామనుకున్నారు. అయితే సమంత ఎపిసోడ్ ను దసరాకు టెలికాస్ట్ చేసారు. అయితే ఇటీవల మహేశ్ బాబు ఎపిసోడ్ ప్రోమోను ఇటీవల విడుదల చేసి త్వరలోనే ఎపిసోడ్ ప్రసారం కానుద్నని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ముగింపు వేడుకగా మహేష్ బాబు ఎపిసోడ్ టెలికాస్ట్ చేసే యోచనలో జెమినీ టీవీ ఉన్నట్లు సమాచారం.

ఈ గేమ్ షోకు గ్రాండ్ ఓపెనింగ్ తోపాటు గ్రాండ్ క్లోజింగ్ కూడా ఉంటుందని వారి అభిప్రాయం కావచ్చు. తాజాగా ఈ ఎపిసోడ్ పై మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తుంది. ఎన్టీఆర్ అడిగిన ఓ ప్రశ్నకు వీడియో కాల్ లైఫ్ లైన్ వాడుకున్న మహేష్, పవన్ కళ్యాణ్ కు కాల్ చేశాడని సమాచారం. దీంతో ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకే సారి స్క్రీన్ పై కనిపిస్తే ఇంకా అభిమానులకు పూనకాలే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వార్తలో తెలుగు ప్రేక్షకులంతా ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

Jay Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button