Featuredఅందంవార్త‌లువైరల్సినిమా

Kim Kardashian : ఈ నటి అలా చేస్తే ఒక్క నైట్ కి 75 కోట్ల రూపాయలు ఇస్తామన్నారట…

Kim Kardashian : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో ఫేమ్ మరియు క్రేజ్ ఉన్నప్పుడే నాలుగురాళ్లు వెనకేసుకు కోవాలి. లేకపోతే క్రేజ్ తగ్గిపోయిన తర్వాత అవకాశాలు తగ్గి పోవడమే కాకుండా ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఈ విషయాన్ని బాగా గ్రహించినటువంటి కొందరు నటీనటులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను పాటిస్తూ జనాల్లో తమకు ఉన్నటువంటి క్రేజ్ ని బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. కాగా పలు అమెరికన్ షోలు, ఈవెంట్లలో హోస్టింగ్ నిర్వహిస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారును మతి పోగొడుతున్న హాలీవుడ్ ప్రముఖ నటి మరియు మోడల్ కిమ్ కర్దాషియాన్ కూడా ఈ కోవకే చెందుతుంది.

కాగా ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోతతో కుర్రకారు మతి పోగొడుతోంది. అలాగే అప్పుడప్పుడు పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయల ఆదాయం అర్జిస్తోంది. మరోవైపు మోడలింగ్ రంగంలో కూడా బాగానే రాణిస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను కూడా నిర్మించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా పలు దుస్తుల తయారీ సంస్థలకి చెందిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 20 కోట్ల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో కిమ్ కర్ధాషియన్ ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి.

అయితే విలాసవంతమైన జీవితానికి పెట్టింది పేరు దుబాయ్ దేశం. ఈ దుబాయ్ దేశంలోని రాజులు అత్యంత సంపన్నులు. దీంతో వీరు ఎక్కువగా ఖరీదైన కార్లు, భవనాలు, నైట్ పార్టీలు, అంటూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే సౌదీకి చెందినటువంటి ఓ రాజు నటి కిమ్ కర్దాషియాన్ ఆట, పాటపై మోజు పడ్డాడు. ఈ క్రమంలో ఓ సారి తన ఇంట్లో పార్టీ జరగగా ఈ పార్టీలో కిమ్ కర్దాషియన్ నృత్యం చేయడానికి దాదాపు 75 కోట్ల రూపాయలు పారితోషకం ఆఫర్ చేశాడట. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ప్రపంచానికి ఆయిల్ సప్లై చేసేటటువంటి దుబాయ్ దేశానికి చెందిన రాజులు ఒక రోజుకి 75 కోట్ల రూపాయలు వెచ్చించడం పెద్ద విషయమేమీ కాదని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒక్క రాత్రికి 75 కోట్ల రూపాయలు పారితోషికం అందుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కిమ్ కర్దాషియాన్ పలు అమెరికన్ షోలలో హోస్టింగ్ నిర్వహిస్తూ మరోపక్క సినిమాల్లో కూడా అడపాదడపా పాత్రలో నటిస్తోంది.

Back to top button