Featuredవార్త‌లువైరల్

Minor Girl : చి.. ఛీ… వివాహేతర సంబంధానికి అడ్డు గా ఉందని కన్న కూతురిని చంపిన తల్లి…

Minor Girl : మామూలుగా తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ చూసుకుంటారని అందరికీ తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు తల్లిదండ్రులు చేసేటటువంటి పనుల కారణంగా చిన్న పిల్లల జీవితాలు అన్యాయంగా బలవుతున్నాయి. కాగా ఇటీవలే ఓ కసాయి తల్లి తన బిడ్డని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి ఏకంగా తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని ప్రియుడితో కలిసి దారుణంగా అభం శుభం తెలియని చిన్నారిని హత్య చేసిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని లింగసముద్రం మండలం తిమ్మారెడ్డి పాలెం గ్రామంలో ప్రశాంతి అనే చిన్నారి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. కాగా ప్రశాంతి తల్లి కుటుంబ పోషణ నిమిత్తమై లింగ సముద్రంలో ఉన్నటువంటి ఓ ప్రాథమిక ఆసుపత్రి లో పని చేస్తోంది. కాగా ఈ మధ్య కాలంలో ప్రశాంతి తల్లికి తన భర్తతో మనస్పర్థలు విభేదాలు రావడంతో తన కూతురిని తీసుకొని దూరంగా వచ్చి బ్రతుకుతుంది. అయితే ఇటీవలే స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తితో ప్రశాంతి తల్లికి పరిచయం ఏర్పడింది. దీంతో అతికొద్ది సమయంలోనే ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో వీరిద్దరూ కలిసి సహజీవనం కూడా చేస్తున్నారు.

అయితే ఈ మధ్య వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వివాహిత కి ప్రశాంతి అడ్డుగా ఉండటంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని పన్నాగం పన్నారు. ఇందులో భాగంగా అభం శుభం తెలియని చిన్నారిని దగ్గరలో ఉన్నటువంటి అడవుల్లోకి తీసుకెళ్లి దారుణంగా హతమార్చి మృతదేహాన్ని తగులబెట్టారు. అనంతరం ఏమి ఎరగనట్లు ఇంటికి వచ్చి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రశాంతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు ప్రశాంతి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇటువంటి వారిని విచారించగా వీరిద్దరి వివాహేతర సంబంధం బయటపడింది దాంతో ప్రశాంతి తల్లిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయట పడింది.

Back to top button