Featuredవార్త‌లువైరల్సినిమా

Pooja Hegde : పెగ్ కలుపుతూ కనిపించిన పూజ హెగ్డే… ఆమె బ్రాండ్ అదేనంటూ ట్రోల్స్….

Pooja Hegde : ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ బ్యూటీ బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. కాగా ఈ అమ్మడు గత ఏడాది హీరోయిన్ గా నటించిన అల వైకుంఠపురం లో చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో వరుసగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు వరించాయి. కాగా ఈ మధ్య పలు మద్యం ఉత్పత్తులకు సంబంధించిన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి సెలబ్రిటీలను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు లిక్కర్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ పలు వీడియోలలో నటించారు.

కాగా తాజాగా పూజా హెగ్డే కూడా తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రెడ్ లేబుల్ సంస్థలకు చెందిన మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేసింది. ఇందులో భాగంగా ఓ వీడియోలో నటిస్తూ ఏకంగా పెగ్ కలుపుతూ కనిపించింది. అలాగే ఈ వీడియో ని తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. అయితే ఈ వీడియో ని షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. అయితే ఇందులో కొందరు మాత్రం పూజా హెగ్డే మద్యం సేవిస్తుందా…? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేసినంత మాత్రాన మద్యం తాగే అలవాటు ఉందనుకోవడం పొరపాటని అలాగే యాడ్ స్క్రిప్ట్ కి అనుగుణంగా సెలబ్రిటీలు అందులో నటిస్తారని కామెంట్లు చేస్తున్నారు. కాగా నటి పూజా హెగ్డే ప్రమోట్ చేసిన రెడ్ లేబుల్ విస్కీ ధర తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రెండు వేల రూపాయల వరకు ఉంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ పై మనసు మళ్లినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందువల్లే గత కొద్ది నెలలుగా ఈ అమ్మడు పలు టాలీవుడ్లో చిత్ర అవకాశాలు తలుపు తడుతుంది ఇప్పటికీ పెద్దగా రెస్పాండ్ కావట్లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Back to top button