Featuredసినిమా

Katrina Kaif నా నియోజకవర్గంలో రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి అంటున్న మంత్రి

Katrina Kaif బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు గాంచిన హీరోయిన్ లలో కత్రినా కైఫ్ ఒకరు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఈ అమ్మడు త్వరలో పెళ్లి వధువుగా మారనున్నారు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్ ప్రేమాయణం కొనసాగిస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. త్వరలోనే ఈ జంట పెళ్లి ముహూర్తం ఖరారు చేశారని బీ టౌన్ లో సమాచారం. టాలీవుడ్ లో మల్లీశ్వరి తో అడుగు పెట్టారు కత్రినా కైఫ్. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు కత్రినా. ఆ తర్వాత బాలయ్యతో అల్లరి పిడుగు చిత్రంలో నటించారు కత్రినా. కానీ ఆ సినిమా ఆశించిన మేర ప్రేక్షకులను అలరించలేక పోయింది. దాంతో ఈ భామకు తెలుగులో సరైన గుర్తింపు రాలేదనే చెప్పుకోవాలి. గతంలో సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ తో ప్రేమను కొనసాగించిన ఈ భామ ఎట్టకేలకు విక్కీ కౌశల్ ని ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. అయితే తాజాగా కత్రినా కైఫ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.

రాజస్థాన్ రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ గుధా హీరోయిన్ కత్రినా కైఫ్ శరీర భాగాన్ని ప్రస్తావిస్తూ బహిరంగ కామెంట్లు చేసిన ఉదంతం ఇప్పుడు వివాదాస్పదమైంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రెండ్రోజుల కిందటే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం తెలిసిందే. ఆ విధంగా రాజేంద్ర సింగ్ గుధా రాజస్థాన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన మూడో రోజే హీరోయిన్ కత్రినా కైఫ్ ను ఉద్దేశించి రాజేంద్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం ఉదయ్ పూర్వతిలో రాజేంద్ర పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడికొచ్చిన ప్రజలతో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేశారు.

ఈ మేరకు రోడ్ల సమస్య ఉందని ప్రజలు చెప్పడంతో… సంబంధిత అధికారిని పిలిపించి మాట్లాడారు. ఈ మేరకు అందికరితో మాట్లాడుతూ ‘ఏంది ఇంజనీర్ సాబ్.. ప్రజలు ఏమడుగుతున్నారో వినిపించింది కదా అని చెప్పారు. గుర్తుంచుకోండి నా నియోజకవర్గంలో రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి. ఆ హీరోయిన్ బుగ్గలు ఉన్నంత నాజూగ్గా రోడ్లు కావాలి అంటూ సంబోధించారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న ప్రజలంతా నవ్వారు. ప్రస్తుతం మంత్రి రాజేంద్ర సింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండింగ్ గా మారాయి.

Jay Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button