Featuredసినిమా

Siva Shankar Master శివశంకర్ మాస్టర్ అండగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్…

Siva Shankar Master కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. వ్యాధి తీవ్రతతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వివిధ దేశాల్లో మరోమారు పంజా విసిరేందుకు సిద్ధమైంది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో రోజు రోజు కరోనా మహమ్మారి కేసులు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ప్ర‌ముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్ కూడా కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల క్రితం శివ శంకర్ మాస్టర్ కు కరోన సోకగా తాజాగా ఆయనను హైద‌రాబాద్ న‌గ‌రం లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చేర్చారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ తో పాటు ఆయ‌న భార్య‌కు, పెద్ద కుమారుడికి కూడా క‌రోనా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ఆయ‌న భార్య హోం క్వారంటైన్ లో ఉండ‌గా… కుమారుడు మాత్రం అప‌స్మార‌క స్థితిలో ఉన్న‌ట్టు సమాచారం. శివశంక‌ర్ మాస్ట‌ర్ ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన పరిస్తితి విషమంగా ఉన్నట్లు వైద్యలు వెల్లడించారు. తెలుగు, త‌మిళం, హింది తో పాటు మొత్తం ప‌ది భాష‌ల సినిమాల‌కు శివ శంకర్ మాస్టర్ కొరియో గ్రాఫ‌ర్ గా ప‌ని చేశారు. అలానే తెలుగులో పలు డాన్స్ షో లకు జడ్జి గా కూడా వ్యవహరించారు. అయితే కష్ట కాలమైనా కరోనా సమయంలోనే ఎంతోమందికి తన వంతు సహాయం చేసి తమ తమ గమ్యాలకు చేరేలా చేసి రియల్ హీరోగా మారారు సోను సూద్. ఇప్పుడు ఆ రియల్ హీరోనే శివశంకర్ మాస్టర్ కి అండగా నిలిచారు.

ప్రస్తుతం ఆయన కుటుంబ పరిస్థితి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కారణంగా సినీ ప్రముఖులు ఎవరైనా వారికి సాయం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చని శివశంకర్ మాస్టర్‌ కొడుకు అజయ్ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న సోనుసూద్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటాని ఇప్పటికే తాను వారి కుటుంబంతో మాట్లాడుతున్నాని మాస్టర్‌ను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని తాజాగా సోనూసూద్ తన ట్వీట్‌లో తెలియజేశారు. ఆయన క్షేమంగా తిరిగి ఇంటికి చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

Jay Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button