Featuredసినిమా

Mahesh Babu ఆ హీరోయిన్ విషయంలో బాధపడ్డ సూపర్ స్టార్ మహేశ్ బాబు…

Mahesh Babu తెలుగు సినీపరిశ్రమలో స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. తనదైన శైలిలో నటనలో వైవిధ్యం చూపిస్తూ సినిమా సినిమాకు తనను తాను మార్చుకుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. తెలుగు స్టేట్లే కాకుండా ఇతర భాషల్లో అభిమానులను సంపాదించుకున్న ఘనత ఆయనకే సొంతం. ఎప్పుడూ మూస పాత్రలు కాకుండా వెరైటీ పాత్రలు పోషిస్తూ తనలోని నటనకు ప్రాణం పోస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అందాల నటుడిగా ప్రశంసలు పొందుతున్నారు. అయితే సినిమాల పరంగా అప్డేట్ లను, ఇతరత్రా విషయాలను పంచుకుంటారు కానీ పర్సనల్ లైఫ్ పరంగా గోప్యంగా ఉంచుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు.

పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లను బ్యాలెన్స్ చేస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నారు మహేష్. అయితే మహేష్ బాబు తన చెల్లి విషయంలో మాత్రం చాలా బాధపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చెల్లి అంటే ఆయన సొంత అనుకుంటే పొరపాటు పడ్డట్టే, అర్జున్ సినిమాలో మ‌హేష్‌కు చెల్లిగా న‌టించిన కీర్తిరెడ్డి విషయంలో. ఈ సినిమా అప్పుడు వారి మధ్య బలమైన అన్నాచెళ్లెల్ల అనుబంధం ఏర్ప‌డిందంట. ఆ సినిమా త‌ర్వాత కీర్తిరెడ్డి మ‌హేష్‌ను అన్న‌య్యా అని పిలుస్తూ ఉండేవారంట. అలానే రాఖీ పండ‌గ‌కు మ‌హేష్‌కు రాఖీ కూడా కట్టేవారని అంటున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలిప్రేమ‌ సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి రెడ్డి. ఈ క్ర‌మం లోనే అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వ‌డు సుమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ల‌యిన యేడాదికే మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఈ జంట విడిపోయారు. వీరిని క‌లిపేందుకు మ‌హేష్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా అవి ఫలించలేదంట. దీంతో ఆ విషయంలో మహేష్ చాలా బాధ పడ్డారు అని తెలుస్తుంది. ఇక సుమంత్‌కు విడాకులు ఇచ్చిన కీర్తిరెడ్డి ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. సుమంత్ మాత్రం ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోకుండా అలాగే సింగిల్ గా ఉన్నారు.

Jay Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe, My favorite topics are Movies, Education and Gossips.
Back to top button