Featuredప్రత్యేకంవార్త‌లువైరల్సినిమా

Sudha : ఆ దర్శకుడన్న మాటలకి సినిమా సెట్ లో నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయా…

Sudha : తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ అనే చిత్రంలో హీరో వదిన పాత్రలో నటించి నటిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయమైన తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా రెడ్డి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి సుధా రెడ్డి సినిమా ఇండస్ట్రీకి వచ్చి రావడంతోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ మొదలు పెట్టడంతో హీరోయిన్ కాలేకపోయింది. అయినప్పటికీ కొన్ని వందల చిత్రాలలో అమ్మ, అక్క, చెల్లి, వదిన, తదితర పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి సుధా రెడ్డి పాల్గొని ఓ సినిమా షూటింగులో జరిగిన సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

Telugu actress Sudha

ఇందులో భాగంగా తెలుగులో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన 7/జి బృందావన కాలని చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిందని అయితే ఆ చిత్రంలో తన పాత్ర కూడా ప్రేక్షకులని బాగానే మెప్పించిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు సెల్వరాఘవన్ తనని తన మాటలతో కొంతమేర ఇబ్బంది పెట్టాడని దాంతో తాను సినిమా షూటింగ్ సెట్ నుంచి ఇంటికి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఇతర అసిస్టెంట్ డైరెక్టర్లు మరియు నిర్మాత వచ్చి బలవంత పెట్టడంతో సినిమాలో నటించానని ఆ తర్వాత ఎంత డబ్బు ఇచ్చినా సరే దర్శకుడు సెల్వరాఘవన్ చిత్రాలలో నటించకూడదని ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చింది.

Telugu actress Sudha
Telugu actress Sudha

అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హోదా ఉన్నటువంటి వ్యక్తులయినా సరే సినీ ఆర్టిస్టులతో ప్రవర్తించే తీరు బాగుండాలని అప్పుడే అందరికీ గౌరవంగా ఉంటుందని అలా కాకుండా చిన్న, పెద్ద అనే తారతమ్యాలు చూపిస్తే మంచి ఫలితాలను సాధించలేరని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ రోజు సినిమా షూటింగ్ సెట్లో దర్శకుడు సెల్వ రాఘవన్ మాట్లాడిన మాటలు తనకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయని కొంతమేర ఎమోషనల్ అయింది. అలాగే తనకి సినిమాల్లో నటించేటప్పుడు రెమ్యూనరేషన్ మాత్రమే ముఖ్యం కాదని సినిమాలో నటించే ఆర్టిస్టులు మరియు దర్శక నిర్మాతలతో ఉండేటువంటి రిలేషన్ షిప్ కూడా ముఖ్యమని తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి సుధా రెడ్డి తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషలలో కలిపి దాదాపుగా 300కి పైగా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి వెండి తెరపై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య కాలంలో తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడటంతో సినిమాల పరంగా కొంతమేర జోరు తగ్గించినట్లు ఇంటర్వ్యూలో తెలిపింది.

Back to top button