వార్త‌లుసినిమా

Samantha: త్రివిక్రమ్ కు సమంత బంపర్ ఆఫర్.. మహేశ్ 28 నుంచి పూజా హెగ్డే అవుట్..?

Samantha: త్రివిక్రమ్ కు సమంత బంపర్ ఆఫర్ ఇచ్చిందా..అందుకే మహేశ్ 28 నుంచి పూజా హెగ్డే అవుట్ అయిందా..ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ – 14 రీల్స్ ఎంటర్‌మైంట్స్ – మైత్రీ మూవీ మేకర్స్ కలిపి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌తో పాటు ప్రతీదీ బాగా ఆకట్టుకొని సినిమాపై బాగా అంచనాలు పెంచాయి.

is-samantha-in-mahesh-28th-movie
is-samantha-in-mahesh-28th-movie

ఇక ఈ సినిమాతో మహేశ్ డబుల్ హ్యాట్రిక్ హిట్ సాధిస్తాడని చాలా నమ్మకంగా ఉన్నారు. కాగా మహేశ్ నెక్స్ట్ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కానీ ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమా పనులు పూర్తి కాకపోవడంతో మహేశ్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టేందుకు చాలా సమయం పడుతున్న కారణంగా ఈ గ్యాప్‌లో మహేశ్ మరో సినిమాను చేయాలనుకున్నాడు. అలా త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి కావస్తుండటంతో జనవరి నుంచి ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారట.

Samantha: త్రివిక్రమ్ కు కావాల్సినన్ని డేట్స్ పూజా ఇచ్చే పరిస్థితుల్లో లేదట.

ఇక ఈ సినిమాలో ముందు నుంచి హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుందనే వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. కానీ త్రివిక్రమ్ కు కావాల్సినన్ని డేట్స్ పూజా ఇచ్చే పరిస్థితుల్లో లేదట. బాలీవుడ్‌లో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న పూజా తమిళంలో విజయ్ సరసన బీస్ట్ అనే సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ సినిమాలోనూ పూజానే నటించనుంది. దాంతో బల్క్ డేట్స్ ఇవ్వాలంటే కష్టం అని చెప్పిందట. దాంతో వెంటనే గురూజీ తమన్నాను లైన్‌లోకి తీసుకున్నాడని…మహేశ్ 28 కోసం బల్క్ డేట్స్ ఇస్తానని త్రివిక్రమ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో పూజా బయటకు వచ్చి సమంత ప్రాజెక్ట్‌లోకి ఎంటరైనట్టు సమాచారం. త్వరలో దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుంది.

Back to top button