వార్త‌లువైరల్

Lahari Shari వామ్మో… ఇంట్లోనే మందు దుకాణం పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ….

Lahari Shari మామూలుగా సినీ సెలబ్రిటీలు ఏదైనా ఫోటో లేదా వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇట్టే వైరల్ అయిపోతుంది. ఈ క్రమంలో కొందరు తమ సినిమాలకు సంబంధించిన మరియు అందమైన ఫోటోలు వంటివి షేర్ చేస్తూ ఉంటారు. అయితే తెలుగులో ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి చిత్రంలో ఆస్పత్రిలో పనిచేసే నర్సు క్యారెక్టర్లో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు ప్రముఖ బ్యూటిఫుల్ నటి లహరి షరి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాగా నటి లహరి షరి కి అందం అభినయం నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ తన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో నటిగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అయినప్పటికీ పట్టువిడవకుండా అవకాశాల కోసం శ్రమిస్తూ అడపాదడపా చిత్రాలలో బాగానే ఆకట్టుకుంటోంది. కాగా తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే అలరించింది. కానీ అతికొద్ది సమయంలోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.

అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే లహరి షరి ప్రముఖ మద్యం ఉత్పత్తి సంస్థ అయిన జానీ వాకర్ సంబంధించిన మద్యం ఉత్పత్తులను టేబుల్ పై ఉంచి వాటిని చూపిస్తూ కనిపించింది. అయితే అంతకు ముందు గానే లహరి షరి మందు గ్లాస్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా ఈ లైఫ్ దేవుడిచ్చిన గిఫ్ట్ అని కాబట్టి ప్రతి ఒక్క మూమెంట్ ని ఎంజాయ్ చేయాలని క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 20 వేల పైచిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి. అయితే ఇందులో ఎక్కువగా కొంతమంది మద్యం సేవిస్తే ఆరోగ్యం పాడవుతుందని కాబట్టి మద్యం సేవించ వద్దని కామెంట్లు చేస్తున్నారు.

Lahari Shari వామ్మో... ఇంట్లోనే మందు దుకాణం పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ....
Lahari Shari వామ్మో… ఇంట్లోనే మందు దుకాణం పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ….

అయితే ఈ విషయం ఇలా ఉండగా లహరి షరి సినిమా ఇండస్ట్రీకి రాకముందు న్యూస్ రీడర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కాగా ఇటీవలే ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో లహరికి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వివరించినట్లు అసలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం గురించి నటి లహరి షరి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Back to top button