వార్త‌లువైరల్సినిమా

Samantha : సమంత చదువుకునే రోజుల్లోనే డబ్బు కోసం అలాంటి పని చేసేదట…

Samantha టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ సినీ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. కాగా నటి సమంత కేవలం నటిగా మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. కాగా ఇటీవలే సమంత తన భర్త అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకోవడంతో ఒక్కసారిగా ఈ విషయం సెన్సేషనల్ టాపిక్ గా మారింది. అయితే నటి సమంత మొదటగా తెలుగులో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేసావే అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అయింది. కానీ ఆ తరువాత ఈ అమ్మడికి పలు చిత్రాల్లో నటించే అడపాదడపా అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా అలరించక పోవడంతో కొంతకాలం పాటు అవకాశాల కోసం బాగానే శ్రమించింది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉన్నటువంటి మొదటి ఐదుగురు స్టార్ హీరోయిన్ల సరసన రాణిస్తోంది.

అయితే నటి సమంత రూత్ ప్రభు కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగింది. కానీ ఆమె తల్లిదండ్రులు ఉద్యోగం నిమిత్తమై వచ్చి తమిళనాడు లో సెటిల్ అయ్యారు. దాంతో సమంత చదువులన్ని తమిళనాడు రాష్ట్రంలోని పూర్తి అయ్యాయి. కాగా నటి సమంత కి డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. దాంతో అప్పుడప్పుడు పలు కాలేజీ కల్చరల్ ఈవెంట్లలో బాగానే పాల్గొనేది. ఈ క్రమంలో కాలేజీలో నిర్వహించే మోడలింగ్ లో కూడా పాల్గొనేది. అయితే డిగ్రీ చదువుతున్న సమయంలో నటి సమంత తమిళనాడు కి చెందిన ఆషిక టెక్స్ టైల్స్ కి సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ తీసిన ఓ యాడ్ లో పాకెట్ మనీ కోసం నటించింది. ఇందుకుగాను అప్పట్లో సమంత కి దాదాపుగా ఐదు వేల రూపాయలు పారితోషకం ఇచ్చారట. కాగా ప్రస్తుతం ఆషిక టెక్స్ టైల్స్ కి సంబందించిన ఈ యాడ్ యూట్యూబ్లో తెగ హల్చల్ చేస్తోంది.

Samantha : సమంత చదువుకునే రోజుల్లోనే డబ్బు కోసం అలాంటి పని చేసేదట...
Samantha : సమంత చదువుకునే రోజుల్లోనే డబ్బు కోసం అలాంటి పని చేసేదట…

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది సమంత జాను అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కాగా ప్రస్తుతం తెలుగు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం. అలాగే తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. ఇటీవలే ఈ ఈ విషయం గురించి చిత్ర యూనిట్ సభ్యులు అధికారిక ప్రకటన కూడా చేశారు.

Back to top button