వైరల్

Viral Video : వైరల్ – వర్షంలో రెచ్చిపోతున్న పాములు

Viral Video :  అక్షయ్ కుమార్ – కత్రినా కైఫ్ సూర్యవంశీ మూవీలో టిప్ టిప్ బర్సా పానీ పాటలో యువతను రెచ్చగొట్టే స్టెప్స్ తో అలరించడం మనం చూసాం. జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో లో అక్షయ్ – కత్రినా తో పోటీకి దిగినట్టుగా అచ్చం వారిలాగే హాట్ హాట్ స్టెప్స్ తో రెండు పాములు నాట్యమాడాయి. దట్టమైన పచ్చటి పొదలలో పసుపు పచ్చగా కనిపిస్తున్న ఈ పాములు ఒకదానితో ఒకటి సమన్వయంగా ముడివేస్తూ గాలిలో తేలుతూ మెలికలు తిరుగుతున్నాయి.

ఈ అందమైన దృశ్యాన్ని అక్షయ శివరామన్ అనే మహిళ తన మొబైల్ లో రికార్డు చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని తెన్ కాసి జిల్లాలో నివసిస్తున్న అక్షయ వాకింగ్ చేస్తున్న సమయాన ఈ దృశ్యాన్ని చూసి రికార్డు చేశాను అని చెప్పింది. వీడియో ను రికార్డు చేస్తున్నపుడు తాను అస్సలు భయపడలేదని మరియు పాము నృత్యాన్ని ప్రకృతి యొక్క అద్భుతమైన ప్రదర్శన అని చెప్పారు. ప్రకృతి ప్రదర్శించే ఈ దృశ్యాన్ని ఎవరు అడ్డుకోగలరు..? ఈ వీడియో తీస్తున్నందుకు నాకు భయం లేదు.. అని ఆమె ట్వీట్ చేసింది.

జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొంత వ్యవధిలోనే 58వేల వ్యూస్ తో, 2900 లైక్స్ తో, 500 రీట్వీట్స్ తో వైరల్ గా మారింది. ఏదిఏమైనా అక్షయ శివరామన్ చెప్పిన విధంగా ప్రకృతిని కాపాడుకుంటే ఎపుడు అద్భుతంగానే దర్శనమిస్తుంది.

Back to top button